ఇది నిజం నిజంగా నిజం
ఇది నిజం నిజంగా నిజం (Author: చేపూరు కీర్తి)
నా దేశంలో ఉన్న 22 భాషల్లో
నా ఈ తెలుగు తల్లి నేను ముద్దు బిడ్డ నే కదా
నా భాషను మెచ్చిన వారెందరో ఉండగా
నా భాష వద్దనుకున్న వారు
నా దృష్టిలో అసలు తెలుగు వారే కాదు
నా భాష ప్రపంచంలోనే పేరు పొందిన
భాషల్లో ఒకటి
నా భాషలో ఎన్నో మధురమైన
పిలుపులులుటాయో!
నేను ఈ తెలుగు నేల పై జన్మించడమే
నా అదృష్టంగాభావిస్తాను!
ఎందుకో తెలుసా
ఆంగ్లంలో మమ్మీ అనే పిలుపు కన్నా!
తెలుగులో అమ్మ అనే పిలుపు మిన్నా!
ఇతర భాషల కన్నా నా భాష మిన్న!
నా భాషలో ఉన్నంత ఆప్యాయతలు
అనురాగాలు మరి ఏ భాషలో
కనిపించవు కానరావు
ఇది నిజం నిజంగా నిజం