అధ్యక్షుని సందేశం
అధ్యక్షుని సందేశం (Author: అన్నా మధు)
TFAS సభ్యులందరికీ నమస్కారం.
న్యూ జెర్సీ లో నలభై రెండు సంవత్సరాలుగా తెలుగువారికి సేవ చేస్తున్న మన తెలుగు కళా సమితి అధ్యక్షునిగా నా సేవలందించడం నేను పొందిన గొప్ప అవకాశం మరియూ అదృష్టం. విలువల తో కూడిన కార్యక్రమాలు నిర్వహించడం TFAS యొక్క ఆశయం. ఆ కార్యక్రమ సంకలనం YoutTube లో చూడండి.
నేను రెండు సంవత్సరాలలో నాకున్న పరిజ్ఞానం తో వివిధ రంగాలు ప్రతిబింబించేలా TFAS ఆశయ పూర్వక కార్యక్రమాలను ఏర్పాటుచేసాను. ఈ కార్యక్రమాల నిర్వహణలో నా తోటి 8 మంది కార్యవర్గ సభ్యులు ఇచ్చిన సహకారం మరువలేనిది. స్నేహపూర్వకం గా వారు నాతో చేసిన ఈ అలుపెరుగని ప్రయాణం ఎంతో ప్రశంసనీయం. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. TFAS కి విరాళాలిచ్చి కార్యక్రమాల్ని దిగ్విజయంగా జరగడానికి ప్రోత్సహించిన దాతలకు వేవేల కృతజ్ఞతలు.
మే 31 వ తేదీనుంచి అధ్యక్ష బాధ్యతలను విరమించి జూన్ 1 నుంచి రాబోయే అధ్యక్షురాలు శ్రీమతి మాకం ఉమ గారికి అన్ని బాధ్యతలు అప్పగిస్తున్నాను.
ఈ రెండు సంవత్సరాలుగా మీతో ఏర్పడిన స్నేహం మరుపురాని అనుభూతులను కలిగించి, భవిష్యత్తులో ఎంతో ఆనందం కలిగిస్తుందని నా ప్రగాఢ నమ్మకం.
సెలవు తీసుకొంటూ..
మీ
అన్నా మధు