అధ్యక్షుని సందేశం  (Author: అన్నా మధు - TFAS అధ్యక్షుడు)

సభ్యులకు నమస్కారం.

అతి శీతల ఉష్ణోగ్రతలలో గృహ నిర్బంధంలాంటి జీవితాన్ని గడుపుతున్న మిమ్మల్ని వణుకుతూ పలకరించడం ఒక వింతైన అనుభూతి 

మంచు కురిసే వేళలో పిల్లా పెద్దలతో ప్రమాదం తీసుకోవడం మంచిది కాదని జనవరి 19న తలపెట్టిన సంక్రాంతి వేడుకలను రద్దు చేయడం సబబనిపించినా ఆ వేడుకలను జరుపుకోలేదనే ఆలోచన నా మనసును వీడడం లేదు.  ఏదో విధంగా తలపెట్టిన కొన్ని పోటీలనైనా నిర్వహించాలని నేను, నా కార్యవర్గ సభ్యులు ప్రయత్నిస్తున్నాం.  

అయితే నవంబర్ 19న జరిగిన దీపావళి వేడుకలు సభ్యుల ప్రశంసలతో మిమ్మల్ని ముంచెత్తడం మరిచిపోలేని అనుభూతి.  తెలుగు కళాసమితి విలువలు ప్రతిబింబించేలా ఏర్పాటుచేసిన సంగీత నృత్య కార్యక్రమాలు, కవిత్రయం రూపకం, వేదంలో సాహిత్యం మరియు స్వరం,  అమెరికాలో దేవాలయాలు చేస్తున్న లలిత కళా సేవలు మొదలగు కార్యక్రమాలు సభ్యులచే కొనియాడబడ్డాయి.  అమెరికా జాతీయ, స్థానిక సంస్థ ప్రతినిధుల సహకారంతో మరియు ఎంతో మంది ఇచ్చిన విరాళాలతో ఏర్పాటు చేసిన దీపావళి వేడుకలు Jo Ann Magistro Performing Arts Center, East Brunswick ప్రాంగణాన్ని కళకళలాడించాయి.  విద్యార్థులతో ఏర్పాటు చేసిన Artificial Intelligence నమూనాలు సభ్యులు విశేషంగా ఆకర్షించాయి.  దీపావళి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీల్లో గెలిచిన సుమారు వంద మంది విజేతలకు బహుమతులు అందజేయడం వారికి ప్రోత్సాహం రెట్టింపు చేసినట్లయింది.  భారత్ నుంచి వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ శివారెడ్డి గారు, ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ చరణ్ పాకాల మరియు వారి బృందం నిర్వహించిన కార్యక్రమాలను సభ్యులు అనందోత్సాహంగా తిలకించారు.  భారత్ నుంచి వచ్చిన శ్రీ మన్నవ సుబ్బారావు గారు, బ్రిడ్జి వాటర్ టెంపుల్ చైర్మన్ శ్రీ మోహన్ గారు, సాయి దత్త పీఠం నిర్వాహకులు శ్రీ రఘు శర్మ గారు, అమెరికాలో మన అభిమాన ప్రముఖ రాజకీయవేత్త శ్రీ ఉపేంద్ర చివుకుల గార్లు మరియు అనేక తెలుగు సంస్థల సభ్యులు నాయకులు TFAS సేవలను, కార్యక్రమాలను  గుర్తించి ప్రశంసించడం ఒక విశిష్టత. ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే దాతలు సహకారం అతి ముఖ్యం.  శ్రీమతి స్వాతి అట్లూరి గారు, ప్రముఖ సంస్థలైన తానా, నాట్స్, ఆటా, టిటిఏ, మాటా వారు అందించిన విరాళాల సహాయం TFASకి మరువలేని సహాయం.  వీరి సహాయానికి TFAS ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది.

TFAS ముఖ్యోద్దేశాలైన కళారంగ సేవయే కాకుండా, మా కార్యవర్గం న్యూజెర్సీ భారతీయులకు, ముఖ్యంగా ఇన్సూరెన్స్ లేని వారి కోసం, ఉచితమైన వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నది.  డిసెంబర్ 14న ఏర్పాటు చేసిన Chiropractor వైద్యం వల్ల రోగ నివారణ, బాధ నివారణ గురించి కుమారి డాక్టర్ ఉన్నతి చే నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైంది.   సభ్యులు వారి కుటుంబాలతో వచ్చి ఎన్నో ప్రశ్నలకు సమాధానం పొందటం మన TFAS కార్యావర్గానికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.  ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని మా ఆశయం. 

అతి ముఖ్యమైన మరో విషయం తెలుగు జ్యోతి గత 40 సంవత్సరాలుగా ప్రచురించిన అన్నిసంచికలు మన TFAS Web site లో అందుబాటులో ఉన్నాయి.  అందరూ వాటిని చదివి ఆనందించవలసిందిగా కోరుతున్నాను.  ఈ సంచికలలో వ్యాసాలు, కథలు, పాటలు, సాహిత్యం మన మేధస్సు పదును పెంచి, తెలుగు భాష పై మమకారం, ఆసక్తిని ఎన్నో రెట్లు పెంపొందిస్తాయి. అన్నిసంచికలను TFAS Web site లో సమీకరించిన తెలుగు జ్యోతి సంపాదక వర్గానికి, మా కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా IT కమిటీ చైర్ పర్సన్ శ్రీ లోకేంద్ర గిర్కల గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.   

మన కార్యక్రమాల్లో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం త్రిమూర్తి ఆరాధానోత్సవం.  ఈ కార్యక్రమాన్ని మార్చి 9న ఆనంద మందిర్, సోమర్సెట్ లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అత్యంత విలువైన ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని సంగీత త్రిమూర్తులకు నివాళులు సమార్పిస్తూ, ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా పాటిస్తున్న మన గాయనీ గాయకులకు ప్రోత్సాహం ఇవ్వవలసిందిగా ప్రార్థన.

అధ్యక్షునిగా మరొక సంతోషకరమైన సందేశం.  2024-26 కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క బోర్డు సభ్యుడు, సభ్యురాలు అత్యంత ప్రేమతో నాకు సహకారం అందిస్తూ తెలుగు కళాసమితికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

రాబోయే ఉగాది సంబరాలకీ,  త్రిమూర్తి ఫెస్టివల్ కార్యక్రమానికీ విచ్చేసి మీ ప్రోత్సాహం మరియూ మీ సహకారం అందజేయమని ప్రార్థిస్తూ...

మీ

అన్నా మధు

0 comentaris

2025 సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


2025 సంక్రాంతి పోటీలలో బహుమతులు (మా సమాచారం)


ఘనంగా న్యూజెర్సీ తెలుగు కళా సమితి దీపావళి సంబరాలు (TFAS కార్యక్రమాలు)


స్వీయ శ్లోకాలు (ప్రత్యేక బహుమతి) (బాలలు)


యత్ర నార్యస్తు పూజ్యంతే - లక్ష్మీ గాయత్రి (మొదటి బహుమతి) (కథలు)


పల్లవించిన ప్రకృతి (మొదటి బహుమతి) (కవితలు)


అమ్మ నాకంటే చిన్నది (బాలలు)


సారంగి (కథలు)


అనాది ప్రేమికుడు (రెండవ బహుమతి) (కవితలు)


తప్పెవరిది... (కథలు)


ఒంటరి విజయం (కవితలు)


వసుధైక కుటుంబం (కవితలు)


పచ్చని కన్నీళ్లు (కవితలు)


మనసు తలుపు గడియ పడితే ... (కథలు)


మర్యాదగానే ఒప్పేసుకుందాం... (కవితలు)


తీరని ఋణం (కథలు)


వేకువ స్వప్నం (కవితలు)


రెప్ప చాటు స్వప్నం (కథలు)


గెలుపు (కవితలు)


ప్రణయేంద్రజాలం (కవితలు)


నీ చల్లని ఒడిలో సేదదీర్చవూ! (కవితలు)


ఆత్మ సమీక్ష (కవితలు)