ఓ వనిత కథ
ఓ వనిత కథ (Author: నామని సుజనాదేవి)
భవిష్యత్తు/ భవిత తెలియని నేను
ఉన్నచోటే నా శాశ్వత నివాసమనుకుని
అందమైన ఊహల్లో అనుభూతుల ఊయల్లో
అశాశ్వత ఆత్మీయతానురాగ బంధాల్లో మునిగి
ఆంక్షల ఇరుసుపై తెలియకుండానే తిరుగుతూ
కోటి ఆశలతో కోరుకున్న పొదరిల్లె సొంతమనుకుంటా
అకస్మాత్తుగా అపరిచితుడొచ్చి అందమైన కలల్లో దూరి
అనంతమై అంతా తానై ఆక్రమిస్తాడు
నా అనుకున్నవన్నీ పరాయి అయిపోయి
నా ఇంటికి నన్ను చుట్టాన్ని చేసి
అదృశ్యపు గోడ కడతాడు / గోడై నిలుస్తాడు
మమతో ప్రేమో ఇదమిత్ధం గా తేలక ముందే
తెలిసీ తెలియని మత్తులోనే
అమ్మవి అనురాగమయివంటూ తల్లిని చేసి
సంకెళ్ళు లేని పంజరంలో స్వేచ్చ ప్రసాదిస్తాడు
కపటం తెలియని కన్నపేగు బంధం
కమ్మదనం కనులారా ఆస్వాదిస్తూ
కలల రెక్కలకి శాశ్వత తిలోదకాలిస్తాను
కడుపున పుట్టినవారి కోసం వారి
కలల సాకారం కోసం
అహరహం నాకు తెలియకుండానే శ్రమిస్తాను
మళ్ళీ చక్రం పునరావృతం అవుతుంది
వెనక్కి తిరిగి చూసుకుంటే
కల్లలైన కలలు
ఆవిరైన ఆలోచనలు
పగిలిన ఆశలు
విరిగిన మనసు
తెగిన కోరికలు
తీరని ఆశయాలు
నెరవేరని ఆకాంక్షలు
అసంబద్ధంగా మిగిలిన ప్రాయం
గాడి తప్పిన ప్రయాణం
గతి తప్పిన జీవితం
కొత్తగా సప్తవర్ణాల కల వాస్తవానికై పోరాటం!
పోరాటాన్ని సఫలం చేసుకోవడానికై ఆరాటం!!
ఇది ఒక సగటు వనిత జీవితం!!!
*************
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)