సోపతి  (Author: అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము)

నువ్వు X నేను = నేను X నువ్వు

   గుణకార వినిమయ బంధమే సంబంధం, వస్తువు వ్యామోహ లాభాల రాశులమీద 

   మనుషులు మొత్తం వస్తువులుగా మారడమే విషాదం, లాభనష్టాల హిసాబ్ లు 

   చేసే ద్రోహులే అనంతం, స్పందిస్తేనే హృదయం, రెండు చేతులు కలిస్తేనే కరచాలనం,

   ఇదే సంకలన వినిమయ ధర్మం కదా; అవసరాల కోసం పూసే ప్లాస్టిక్ నవ్వు కారాదు

     సోపతి, నాకు నువ్వెంత దూరమో, నీకూ నేనంతే దూరం,

  దూరాల మీద భారాల మీద స్నేహం నిలబడవచ్చు, ఘోరాల మీద ద్రోహుల మీద 

   అసలే కాదు, నేను ప్రేమను నెత్తిన బెట్టుకుని సాగే నిస్వార్థ బాటసారిని,

  ప్రేమను చంపే ఏ ఆయుధం పుట్టలేదు లోకాన, ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రపంచవింతయై 

    పరఢవిల్లచ్చు, నువ్వు ఆఫీసర్ వు కావచ్చు నేను బంట్రోతు ను కావొచ్చు,

 అహంకారం అంతెత్తుగా పడగ విప్పి, మానవ సంబంధాలను అనుక్షణం కాటేస్తే,

   మానవత్వాలను నిటారుగా నిలిపే నిట్టాడు గుంజరా మైత్రీ, ధనం, దౌలత్, ఆస్తి 

    అంతస్తు, అహంకారం, అధికారపు గర్వపుపొర, మత్తుగా గాలిల తేలిపోయే 

   తెప్పలాంటిది మిత్రమా, ముండ్లకంపలు పరిచిన పల్లేరు గాయాల దారిల,

   పచ్చని మల్లెతీగలా వికసించి నీడనిచ్చే జీవకళల దోస్త్, బాధల శూలాలు లోతుగా 

   గుచ్చి దేహాన్ని రక్త సిక్తం జేస్తే, బతుకంతా త్యాగాల సుగంధాలు వెదజల్లేది స్నేహం,

 అత్యాశతో కుప్పలు కుప్పలుగా కుత్తుకలు కోస్తావెందుకు,  విశ్వమానవ స్నేహదూతవై 

   తలా కొంచెం ప్రేమను పంచు, నేను చందమామనై ముసిముసిగా నవ్వుతుంటా;;

———————————శుభంభూయాత్———————————————————


أضف تعليقات