రెండు నీలిరంగు పెట్టెలలో నా జీవితం
రెండు నీలిరంగు పెట్టెలలో నా జీవితం (Author: కొమరవోలు సరోజ)
సుదూర తీరాల మార్గం నుండి చేతులు చాచి
నన్ను ఆహ్వానించినప్పుడు నేను
నా సురక్షిత ప్రాంతం నుండి
వెలుపలికి నడుస్తున్నాను,
ఎర్రటి దుమ్ముతో నిండిన నేలనూ
నా నేస్తమైన నీలాకాశాన్ని
ఆలింగనం చేసుకోవడానికి సమయం వేచివుంది
ఒకమూల.
నా వేగవంతమైన జీవితానికి వీడ్కోలు పలుకుతున్నప్పుడు విశాలమైన దారివెంట
నడక ప్రారంభించి సూర్యుడు నన్ను చూస్తున్నంతసేపు
వెనుతిరిగి చూడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాను
జీవించని కొన్ని జీవితాలు
కనిపించని కొన్ని ప్రదేశాలు, నేను కొత్త ముఖాలను
కలిసినప్పుడు జీవితం ఆగిపోదు
చేసిన ఎంపికల మధ్యలో చూపులు ఆశ్చర్యపోతాయి
తప్పిపోయిన అవకాశాలు సవాళ్లుగా
ఎదురయ్యాయి.
పూర్తి వృత్తంలో ప్రయాణించడంలో మేల్కొనబడని
అపస్మారక స్థితిలోఉన్న నేను
అనంతంగా వేచివున్న జీవితకాలాలు
మనస్సాక్షి ఉదయించే క్షణం
విశ్వాన్ని సృష్టించిన శాశ్వత జీవి నన్ను
వెతుక్కుంటూ వస్తుంది
నేను రంగులు తీర్చిన చిత్రాలు
ఖాళీ కాన్వాసులూ సందర్శిస్తాను, నేను
ఏ ఒక్క ప్రదేశానికీ బందీని కాదు
పక్షిలా స్వేఛ్ఛగా ప్రయాణిస్తున్నాను
నేను నాజీవితాన్ని
రెండు నీలిరంగు సూట్కేసులలో కొలుస్తాను.