భరత వాక్యం
భరత వాక్యం (Author: బి. గౌతమ్ కుమార్)
చంద్రుడు నిప్పులు కక్కుకుంటూ నేల రాలాడు
సూర్యుడికి మృత్యువు సోకింది చల్లబడిపోయాడు
కోట్ల సంవత్సరాలు ఉదయించిన భానుడు శాశ్వతంగా అస్తమించాడు
వినీలాకాశం నక్షత్ర మండలం లోకాలన్నీ మటు మాయం
చతుర్థశ భువనాల్లో దొంగను వెతికి పట్టుకోవాలన్న కసితో గ్రహాంతర జీవులు
ఎలియన్స్ హాహాకారాల శబ్దం శూన్యంలో విలీనం
సృష్టికి ప్రతి సృష్టి చేయాలని విర్రవీగిన మానవులు
లాభం స్వార్థం ప్రాంత మతాల కాట్లకు బలి
నిస్సహాయులుగా చూస్తున్న వందల కోట్ల జనం
సృష్టిలోని సమస్త అందాలను వికృతం చేసిన వారు
మానవులా దానవులా చరిత్ర హీనులా
మనిషీ ఆది నువ్వు కాదు అంతం నువ్వే
కనురెప్పలు మూయకముందే సృష్టి కథకి చుక్క
మరో విస్ఫోటనం వుంటుందా జీవి లయిస్తుందా
చర్విత చరణమా సృష్టి అందాలు మరోసారయినా
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)