తెలుగు సౌరభం  (Author: నూతక్కి పూర్ణ ప్రజ్ఞా చారి)

సీ.           లలితా విభూషి తాలతి పద యాకృత

                            శ్రావ్యతా సౌరభసరళి తెలుగు

              గంగా తరంగ యభంగ మృదంగని

                            క్వణక్వణ నినదంపు చలిత తెలుగు

              మకరంద మాధుర్య మార్దవ కులదీప

                            యలి వేణి వెల రాణి యలఘు తెలుగు

              అంబరూ వన కాంత యార్ఘార్హ వర కాంత

                            సూనృత కళ కళ సదము తెలుగు!

.వె.      మధుర మోహ నాక్షరముల నిలయ వాణి

              తరిగిపోని సాహితీ త్రివేణి

              పుష్ప గర్భ గంధ పరిమళ దామిని

              అవని తెలుగు అనిన అధర మధుర!

సీ.           కలదె ఎందైనను కమ్మని మన తెల్గు

                            భాషకు యున్నట్టి బరుసు ఇలను

              కలదె ఎందైనను కమనీయ తల జిందు

                            తెలుగు రుచిని ఇచ్చు తీపి తనము

              కలదె ఎందైనను కావ్య రాజము లందు

                            తెలుగు రచన సాటి తెల్పు టకును

              కలదె ఎందైనను కలదు తెలుగు కన్న

                            మిన్న యైనది యున్న దనెడి వాక్కు!

ఆ.వె.       కమ్మ దనము నిచ్చి గౌరవమును పొంది

              తీయ దనము కల్గి తేజరిల్లి

              కావ్య, కళల యందు కడు గొప్ప ఖ్యాతిని

              పంచి ఇచ్చినట్టి పడతి తెలుగు!

أضف تعليقات

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)