గెలుపు  (Author: రాంభక్త పద్మావతి)

గెలుపు జేబులో ఉంటుంది

గుండె గంతులేయదు

కనపడని ముల్లేదో

ఉండుండీ గుచ్చుతుంటుంది

 

వాదన

తారస్థాయికి చేరినపుడు

చెయ్యి పైన ఉండాలనే ఆరాటం

చూపుకు గంతలు కట్టేస్తుంది

మనసు నోరు మూసేసి

మెదడు మాట్లాడడం

ఆరంభిస్తుంది

 

అహమో గుడ్డితనమో

ఆకాశాన్ని మబ్బై కమ్మేసి

పెదవి పదునైన పలుకులను

అవిశ్రాంతంగా చల్లుతూ పోతుంది

 

దేహం ఎగిరెగిరి పడుతూ

ఎదురుగా ఉన్న శ్వాసను

నిర్ధాక్షిణ్యంగా బంధిస్తుంది

 

తీరా విజయం వరించాక

హృదయం

ఎంత పని చేశావని నిలదీస్తుంది

 

చేజేతులా

అనుబంధపు దారం

పుటుక్కున తెంపేసినందుకు

లోపల తుపాను మొదలవుతుంది

 

అన్నిసార్లూ

గెలుపు ఆనందాన్ని బహూకరించదు

జీవితంలో ఒక్కోసారి

ఓడిపోవడమే నిషానిస్తుంది.

******

أضف تعليقات

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)