కోతి చేసిన సాయం  (Author: బి శ్వేత)

చిట్యాల ఊరికి దూరంగా ఒక అడవి ఉండేది. అడవికి దగ్గరలో రాజయ్య అనే రైతు భార్యా పిల్లలతో కలిసి నివాసం ఉండేవాడు. పక్కనే అతనికి పొలం ఉండేది. ఒకరోజు రాజయ్య పొలంలో దోసకాయలు పండించాలని అనుకున్నాడు. దోసకాయల తోట వేశాడు. కానీ అడవికి దగ్గరగా ఉండడం వల్ల జంతువులకు భయపడి దోసకాయలు ఏరడానికి ఎవరూ రావడంలేదని చాలా బాధపడ్డాడు. రాజయ్య ఇంటి పక్కన చెట్టు మీద ఉండే కోతి ఇదంతా గమనించింది. రాజయ్యకు సాయపడాలని అనుకుంది. రాజయ్య తోటకు వచ్చేసరికి దోసకాయలన్నీ ఏరి బస్తాలలో నింపి పెట్టింది. రాజయ్య తోటకు వచ్చి చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఎవరు ఏరారో అర్థం కాలేదు. ఇంతలో కోతి వచ్చి నేనే ఏరానని రాజయ్యకు చెప్పింది. రాజయ్య కోతికి ధన్యవాదాలు తెలిపి, తన ఇంట్లో ఎప్పటికీ ఉండిపొమ్మని తాను తెచ్చుకున్న అన్నం పెట్టాడు.

أضف تعليقات