క్రొత్త చేతులు మొలకెత్తాలి  (Author: శింగరాజు శ్రీనివాసరావు)

గోడలు లేని గదిలో, మాటరాని మూగజీవి ముందు
ఒక్కొక్కటిగా తెరమీద దృశ్యాలు కదులుతున్నాయి

ఆడతనమే తనదైన నేరానికి నడివీధిలో
ఆచ్ఛాదన లేని మానం నలుగురికీ వినోదమయింది

వేలానికి వేయబడిన శరీరం చాపలా పరచబడి
ఎందరి పాదాల కిందో నిర్దాక్షిణ్యంగా తొక్కబడుతున్నది

వంటినిండా వస్త్రాన్ని కప్పుకున్న దేహాన్ని చీల్చుకుని
లోపలి కాయాన్ని కాల్చుకు తింటున్న కళ్ళే లోకమంతా

అమ్మతనాన్ని ఛిద్రంచేసి ఆడతనం మీద దాడిచేసే
పరమకిరాతక దృశ్యం కంటిపాపను కాల్చివేస్తున్నది

మొగ్గ దశ నుంచి మాడి మసై పోయే వరకు
నిప్పుల కొలిమిలో నడుస్తున్న స్త్రీ జీవనభ్రమణాన్ని చూసి

గది దాటి రావాలంటే భయంతో వణుకుతున్నది భ్రూణం
విత్తుగానే గర్భంలో మాడిపోతే జీవనరణమైనా తప్పుతుందని

తనకుతానే శిక్ష విధించుకోవాలనుకునే గర్భస్థ శిశువుకు
తల్లి చేతులే కోటగోడలుగా మారి భరోసాను ఇవ్వాలి

తల్లి ఒడి తొలి బడిగా మారి ఆత్మరక్షణ పాఠాలు నేర్పాలి
దాడిచేసే వారిని దండించే కొత్త చేతులు మొలకెత్తాలి

పసి నవ్వులతో ఆడశిశువు పొత్తిళ్ళకు చేరాలి
పడతిని పూజించే పవిత్రభావం సమాజంలో పురుడు పోసుకోవాలి

గాంధీజీ కలలగన్న స్త్రీ స్వేచ్ఛకు రెక్కలు వచ్చి
నడిజామున కూడ ఆడపిల్ల నిర్భయంగా నడవగలగాలి...

أضف تعليقات

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)