అంతరంగ తరంగాలు  (Author: గొడవర్తి మైత్రి)

అడుగులు ముందుకు వెయ్యాలనే ఓ అతివా!

ఒకడుగు ముందుకు పడగానే సంప్రదాయపు సంకెలతో వెనక్కిలాగేరు.

 

ఊహల రెక్కలతో ఎగరాలనుకునే నీకు నేలపై రెండడుగులే దక్కలేదుగా, పాపం!

కన్నపాశం నిన్ను అందలాలెక్కించాలనుకున్నా జనారణ్యానికి నీవు తోవ తప్పుతావో, లేక తప్పిస్తారోననే భయం నీ తల్లిదండ్రులనశక్తులను చేస్తోంది.

 

ఒకనాటి మాయింటి మహాలక్ష్మి, తర్వాత గుండెలపై గుదిబండ, విద్యాబుద్ధులు నేర్చి తల్లిదండ్రులకు చేదోడువాదోడయ్యంది.

కానీ ఏంచేస్తాం తల్లీ! జనారణ్యంలో ఎన్ని తోడేళ్ళు, పులులు, వేటకుక్కలు…

 

వద్దులే తల్లీ! వాటితో పోలికెందుకు?

అవి కడుపు నిండితే తొలగిపోతాయి, నీ శరీరం మీద వాటికి మక్కువ లేదు.

ఆడదానికి తెలివెందుకు, చదువెందుకు? ఒక్క అవయవమే చాలనుకునే పురుష పుంగవులు పెరుగుతుంటే…

మనో వల్మీకాలలో విషసర్పాల ఫూత్కారాలు…

ఆడదై పుట్టడంకంటే అడవిలో మానై పెరగడం మేలనే కాలానికి నడుద్దామా!

 

ఓ యువతీ యువకులారా! పోర్న్ సాహిత్యాలను ఖండించండి,  నియంత్రించని ప్రభుత్వాలను నిలదీయండి.

ఒక గురజాడ ఒక కందుకూరి ఒక ఈశ్వర చంద్రుడు కారా మీకాదర్శం?

చెయ్యీ చెయ్యీ కలపండి, స్నేహితులై నడవండి

సమాజాన్ని ముందుకు నడపండి.

 

తల్లీ! చేసుకో నీ కరాలను కరవాలాలుగా

ముగురమ్మల మూలపుటమ్మవి, ఆదిశక్తివి

సంకెలలు తెంచుకో…

గోడపైకి చేరి దండ వేయించుకోకమ్మా!

దండలు వేయించుకో, దండాలు పెట్టించుకో!

యువతీ యువకులారా!  మీదే ఈ బాధ్యత, తల్లిదండ్రులారా మీది కూడా.

أضف تعليقات

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)