'సామెతలు' - 2వ విడత
'సామెతలు' - 2వ విడత (Author: అప్పారావు)
క
కనకముల చెయ్యి ఆడితే, కడియముల చెయ్యి ఆడును
కంచము అమ్మి మట్టెలు కొన్నట్టు
కంచు మోగినట్టు కనకము మోగునా
కంటికి యింపయితే, కడుపుకు యింపు
కండ్లకు దూరమైతే చెవులకు దూరమా
కండ్లు చెరిపిన దేవుడు మతి యిచ్చినట్టు
కండ్లు పోయిన తర్వాత సూర్య నమస్కారములా?
కండ్లు ఉండగా కాటుక
కందకు లేదు, చేమకు లేదు, తోటకూర కు వచ్చెనా దురదా?
కందకు లేని దురద బచ్చలికేమి
కక్కిన ఇంటికి పుణుకులు చెప్పేవారు వేయిమంది
కట్టినవానికి ఒక ఇల్లయితే , కట్టనివానికి వెయ్యిండ్లు
కట్టుకొన్నా ఆపే పెట్టుకొన్నా ఆపే వుండగా, ఎదురుపడ్డ ఆపే ఎండిపోయినదట
కడగ పోయే శనైశ్చరుడా మా యింటిదాక వచ్చి పొమ్మనట్టు
కడవంత గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువ
కడుపు కూటికి యేడిస్తే, కొప్పు పూలకు యేడ్చినది
కడుపుతో వున్నమ్మా కనక మానునా, వండినమ్మ తినక మానునా
కడుపునిండా గారెలు తింటే, వంటినిండా జ్వరము.
కడుపు నిండిన బేరము.
కడుపు నిండినవానికి గారెలు చేదు.
కడుపులో బిడ్డ కడుపులోనే వుండగా, కొడుకు పేరు సోమలింగం.
కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తున్నదా.
కడుపు వస్తే కనే తీరవలెను.
కతికితే అతకదు.
కట్టి తీసి కంపలో వేసి ఏకు తీసి పొడుచుకొంటానన్నట్టు.
కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు.
కథకు కళ్ళు లేవు ముంతకు చెవులు లేవు.
కననిది బిడ్డ కాదు, కట్టనిది చీర కాదు.
కని గుడ్లు విని చెవులు.
కనుక్కొని రారా అంటే కాల్చి వచ్చాడు.
కన్ను తగిలే పుల్లను కనిపెట్ట వద్దా.
కన్ను పోయేంత కాటుక పెట్టుకోండురా.
కన్ను యెరగకున్నా కడుపు యెరుగుతుంది.
కన్నెల పోయినాయి కనకలింగమా అంటే, చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నాడట.
కప్పకు కాటూ, బ్రహ్మణునికి పోటూ లేదు.
కమ్మనీచు కడిగినా పోదు, కాకిచిప్ప పెట్టి గోకినా పోదు
కర్ణ ప్రతాపము.
కర్మములు గల మగని కంబట్లోకట్టి బుజముమీద వేసుకొంటే జారి వీధిలో పడ్డట్టు.
కర్ర లేనివాణ్ణి గొర్రె అయిన కరుస్తుంది.
కర్రి కుక్క కపిలగోవు అవునా.
కలకాలపు దొంగ ఒకనాడు దొరుకుతాడు.
కలలో పాలు తాగడానికి కంచుదైతేనేమి కనకపుదైతేనేమి.
కలలో భోగము.
కలవారియింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు.
కలిగితే కాళ్లుముయ్యా, లేకపోతె మొకాళ్లుముయ్యా.
కలిగినయ్య గాదె తీసేటప్పటికి పెదవానికి ప్రాణము పోయినది.
కలిగినయ్య కలిగినయ్యకే పెట్టును, లేనయ్య కలిగినయ్యకే పెట్టును.
కలిపోసి కలిపి పెట్టినా వట్టి వంక చూస్తాడు.
కలిమిలేములు కావటి కుండలు.
కలియుగ రావణాసురుడు.
కల్పవృక్షము క్రింద గచ్చపొద వున్నట్టు.
కళ్ల పసిడికి కాటిమెందుకు.
కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు
కష్ట సుఖాలు రెండు కావటి కుండలు వంటివి.
కాకి కర్రుమంటే గుండె ఝల్లుమంటుంది.
కాకి గండ గుండి గాని కోకిల పిరికి.
కాకిని తెచ్చి పంజరములో పెట్టిన చిలుక వలె పలుకునా.
కాకి పిల్ల కాకికి ముద్దు.
కాకి పుట్టీ నలుపే పెరిగీ నలుపే.
కాకి ముక్కున దొండపండు కరుచుకొన్నట్టు.
కాకులకు కాని నెమ్ములు కాస్తేనేమి పూస్తేనేమి.
కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు.
కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు.
కాటికి కాళ్ళు చాపుకొని తిండికి చెయ్యి చాచేవాడు.
కాటికి పోయినా నన్ను నమ్మరాదు.
కాటిలో పండినవి కాకులు తిన్నవి.
కాదు కాదు అంటే నాది నాది అన్నదట
కానకుండా కట్టెదిచ్చేను కానీ వినకుండా వీరనాల వాయించేవాడు.
కానని వారి పాయసం గంపలది అన్నట్టు.
కాని కాలముకు కర్రె పాము అవుతుంది.
కానీ మందం కోటి దుఃఖం.
కాని వాడు లేని వాడితో జత.
కానీ వెలకు కందులు గుగ్గిల్లు అయినట్టు
కాపు వచ్చినా కరువు వచ్చింది
కారణము లేకనే కార్యము పుట్టదు.
కార్యం గొప్పా వీర్యం గొప్పా ?
కాలం నాటి కంది గింజ, పెద్దల నాటి పెసర గింజ.
కాలనేమి జపము.
కాలబెట్టి నేల రాసినట్టు.
కాల మొక్క రీతి గడప వలెను.
కాలానికి కడగండ్లు దేశానికి తిప్పలు వచ్చినవి.
కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి.
కాలితో చూపిస్తే తలతో చెయ్యవలెను.
కాలిన పిల్లి వలే తిరుగుతాడు
కాలు జారితే తీయవచ్చు గాని, నోరు జారితే తీయకూడదు.
కాలు జారి నేలనుపడి భూమి అచ్చి వచ్చింది కాదన్నట్టు.
కాళ్లు పట్టుకొని లాగితే చూరు పట్టుకొని వేళాడేవాడు.
కాలే కడుపుకు మందు గంజి.
కాళ్లను చుట్టుకున్న పాము కరవక మానునా
కావడి ఎన్ని వంకలు పోతేనేమి యిల్లు చేరితే సరి
కాశీకి పోగానే కర్రి కుక్క గంగి గోవు అగునా
కాశీకి పోయి కుక్క బొచ్చు తెచ్చినట్లు
కాశీకి పోవడము ఒకటి , కావడి తేవడము ఒకటి
కాశీకి వెళ్లి గాడిద గుడ్డు తెచ్చినట్లు.
కాసుకు గతిలేదు, కోటికి కూడా చేసాడు
కాసుకు దోవ లేదు, నూటికి పరవాలేదు.
కాసు గొడ్డుకు రూక బండే
కిం అంటే కం అనలేదు
కీడెంచి మేలెంచవలెను
కుంచెడు గింజలకు కూలికిపోతే, తూమెడు గింజలు దూడ తిన్నట్టు
కుంటి గాడిదకు జారిందే సాకు
కుంటెద్దు రానిదే దూల మెత్తారు
కుండలో కూడు కూడు గానే వుండవలెను, పిల్లలు మొద్దులలాగునే వుండాలి
కుండల్లో గుర్రాలు తోలేవాడు
కుంపట్లో తామర మొలిచినట్టు
కుక్క అమేధ్యము (పవిత్రము కానిది) తిన్నది
కుక్క కాటుకు చెప్పు దెబ్బ మందు
కుక్కకు వచ్చేవి అన్నీ గొగ్గి పండ్లు
కుక్క తీసిన కొయ్యా నక్క తీసిన కొయ్యా
అందాలలో ఊరికినాది
కుక్కతోక పట్టుకొని గోదారి ఈద వచ్చా?
కుక్కను అందలములో కూర్చుండ పెట్టితే, ఆమేధ్యము చూచి దిగా ఉరికినది
కుక్కను కొట్టితే యిల్లంతా పారుతోంది
కుక్కను చంపిన పాపము గుడి కట్టినా పోదు.
కుక్కను ముద్దు పెట్టుకుంటే, మూతెల్లా తెగ నాకుతోంది
కుక్క నోట్లో కర్ర పెట్టితే లొల్లి మంటున్నది
కుక్క వేషం వేస్తే, మొరగకుండా వల్ల కాదు
కుక్క సంతకు పోయి తునకోల దెబ్బలు తిన్నట్టు
కుట్టిన తేలు గుణవంతురాలు , కూసినమ్మ కుక్క ముండ
కుడవబోతూ కూరకు రుచి అడిగినట్లు
కుడుములు వండలేని ఆడది, కూనరాగము తియ్యలేని మొగవాడు లేరు
కుప్ప తగలబెట్టి పేలాలు వేయించుకొని తినేవాడు
కుప్పలో మాణిక్యము
కుమ్మర ఆవములో గచ్చకాయ వేసినట్టు
కుమ్మర ఆవములో ఇత్తడి ముంత దొరుకునా
కుమ్మరిపురుగుకు మన్ను వొంట అంటదు
కురూపి యేమి చేస్తున్నాడంటే, సురూపాలన్నీ, లెక్కపెడుతున్నాడట
కులమింటి కోతి అయిన మేలు
కుల మెరిగి చుట్టము,స్థలమెరిగి వాసము.
కులహీనమైనా, వారాహీనము కారాదు. వర
కూచమ్మ కూడ బెట్టితే, మచ్చమ్మ మాయము చేసినది.
కూటికి పేదయితే, కులానికి పేదా ?
కూడు గుడ్డ అడగకపోతే, బిడ్డను సాకినట్టు సాకుతాను అన్నాడట
కూడైతే కద్దుగాని కులస్థులకు వెరచి వచ్చాను
కూతురని కుంచె డిస్తే, తల్లియని కంచెడు బెట్టినాదట
కూన అని పెంచితే, గండు అయి కరవ వచ్చినది.
కూనలమ్మ సంగీతము వింటే పుణ్యము లేదు, వినకుంటె పాపము లేదు.
కూర్చుండి పడుకోవలెను.
కూర్చొండి లేవలేడు గానీ, యెగసి తాటికాయలు తన్నుతానన్నాడట
కూర్చుండి లేవలేడు గానీ, వంగుండి తీర్థం వెళ్తానన్నాడు.
కూలికి వచ్చి పాలికి మాట్లాడినట్లు.
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిపినది
కృతగ్నునికి చేసిన మేలు
కొండంత దూదికి కొండంత నిప్పు యేల
కొండంత దేవుణ్ణి కొండంత పాత్రతో పూజ చేస్తారు
కొండంత రెడ్డి పొగ పిడికెడు బొచ్చుకు ఏడ్చినట్టు
కొండకు వెంట్రుక ముడి వేస్తే, వస్తే కొండ వస్తున్నది, పోతే వెంట్రుక పోతుంది
కొండ తలకింద పెట్టుకుని రాళ్లు వెతికినట్టు
కొండ తవ్వి ఎలుకను పట్టినట్లు
కొండనాలుకకు మందు వేస్తే, వున్న నాలుక ఊడిపోయినట్టు
కొండను చూసి కుక్కలు మొరిగినట్టు
కొండ మంగలి గొరికినట్లు
కొండ మింగే వానికి గోపురము అడ్డమా
కొండ మీద దెబ్బుబాలేమంటే, కోమట్ల రహస్యాలు అన్నట్టు
కొండమీదినుంచీ పడ్డ వారికి గాయములు యెన్ని?
కొండా యెక్కే వాని మొలను కొడవలి చెక్కినట్లు
కొండ వలె వచ్చి మంచు వలె తేలినట్టు
కొండవీటి చేంతాడు
కొంప తీస్తావా రామన్నా అంటే, అందుకే సందేహమా అన్నట్టు
కొట్టకమునుపే ఏడుస్తావేమంటే, ముందు కొట్టబోతావని ఏడుస్తానంటూ
కొడుకు బాగుండవలె, కోడలు ముండ మొయ్య వలె
కొత్త కుండలో జోరీగా చొచ్చినట్లు
కొత్త నీరు వచ్చి, పాత నీరు కొట్టుకొని పోయినది
కొత్త నీళ్లకు చేపలెదురెక్కినట్లు
కొత్త బిచ్చపువాడు పొద్దెరగడు
కొత్త వింత, పాత రోత
కొన్నవాడి కన్న, తిన్నవాడే మేలు.
కొన్న వాడే తిన్నవాడు
కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కేవురా అంటే, దూడ గడ్డి కోసం ఎక్కుతున్నానంటూ
కొరివితో కొప్పు గోక్కున్నట్టు
కొలిచేవాడు గుడ్డి, కొలిపించుకునేవాడు గుడ్డి
కొసరిన కూరలో గాని పసలేదు
కోటివిద్యలు కూటి కోరకే
కోడలికి బుద్ధి చెప్పి అత్త రంకుపోయినది.
కోడలు కొడుకుని కంటానంటే, వద్దనే అత్తగారు వున్నదా ?
కోడలు గృహప్రవేశము, అత్త గంగప్రవేశము.
కోడికి కులం లేదు, కోమటికి విశ్వాసం లేదు
కోడిగుడ్డు పగలగొట్ట, గుండ్రాయి కావాలి
కోడిపిల్లమీద పందిపిల్ల బలాదూర్
కోతి పోయి కొమ్మ ఎక్కినట్లు.
కోతి కి అద్దం చూపినట్లు
కోతికి కొబ్బరికాయ దొరికినట్టు
కోతికి జలతారు కుళ్ళాయి పెట్టినట్టు
కోతి చేతి పామువలె
కోటి పిడికిలి
కోతి పుండు బ్రహ్మరాక్షసి
కోమటి నిజము
కోమటి పిరికి, కొట్టితే వూరికి
కోమటి యిల్లు కాలినట్లు
కోమటి విశ్వాసము
కోమటి సాక్ష్యం
కొలలేని పెట్టు, తాడులేని కట్టు
కోళ్లకు రెక్కలూ తాళ్లకు చండ్లు వున్నట్టు
కోళ్లకు రెక్కలూ తాళ్లకు చండ్లు వున్నట్టు
కోళ్ల బేరానికి వెళ్లి, కోటలో కబుర్లు అడిగినట్టు
ఖ
ఖాజీని ఫాజీగా ఫాజీని ఖాజీగా చేస్తాడు
గ
గంతకు తగిన బొంత
గంధపొడి లో బూరగ పట్టినట్లు
గంప సిడి కాదు, గాలపు సిడి
గచ్చపొద మీద యిసుక వేసి కయ్యానికి పిలుస్తున్నది
గజ కచ్చవ పోరు చందము
గట్టివాడే గానీ, కడుపు మాత్రమే గుల్ల
గట్టి విడిచి పెట్టి పొట్టు కు పోరాడినట్లు
గట్టు చేరిన వెనుక పుట్టివానితో పొట్లాడినట్లు
గడ్డ తిన్నా కంపే, పాయ తిన్నా కంపే
గడ్డపలుగు గాలికి కొట్టుకుపోతూ వుంటే, పుల్లాకు నా పని ఏమి అన్నాదట
గడ్డపలుగు మింగి శొంఠి కషాయం తాగినట్లు
గడ్డము కాలి వొకడు ఏడుస్తూ ఉంటే, చుట్టకు నిప్పు యిమ్మని వొకడు వెంబడించినట్టు
గతి లేనమ్మకు గంజే పానకము
గతి లేనమ్మకు మాటలేని మొగుడు
గబ్బిలం ఆకాశము పడకుండ పట్టుకొంటానన్నట్టు
గరుడయ్య లెస్స అంటే, శేషయ్య లెస్స అన్నారు
గాజుల గుడికి రోకలి పూనినట్లు
గాజుల బేరము భోజనానికి చీర
గాడిదే గంపెడు వూక తిన్నది అన్నట్టు
గాడిదే గత్తర ( ఉపద్రవం)
గాడిదపిల్ల కోమలము
గాడిద పండుకు బూడిదే మందు
గాదె కింది ఎలుక గాదె కింద బ్రతుక వలెనుగాని, మరి యెక్కడ బ్రతుకుతుంది.
గాదె నిండా బియ్యం వుంటే, కరువునా కలనా నా భార్యనూ పిల్లలనూ నేనే రక్షించానన్నాడట
గానుగ రోట్లో చెయ్యి పెట్టి పెరుమాళ్ళ కృపా అన్నట్టు.
గానుగాపే గానుగాపే నీవు కూర్చున్నా పనేగడ నూనె పొయ్యడము కదా
గాము (సూర్యాదిగ్రహము) సోకినట్టు
గారాబము గార్లకు ఏడిస్తే, వీపు దెబ్బలకి ఏడుస్తుంది
గాలికి పుట్టి ధూళికి పెరిగినట్టు
గాలికి పోయే పేలపిండి భాగవతార్పితమన్నట్టు
గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ చూపుమన్నట్టు
గాలీ వానా వస్తే కథే మారుతుంది
గుండ్రాయి దాస్తే, కూతురి పెండ్లి నిలుచునా
గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు
గుడి పాము కరిచినట్టు, గంగిగోవు పొడిచినట్టు
గుడి మింగే వానికి గుళ్లో లింగము ఒక లెక్కా?
గుడిలో గంట పోతె, నంబికేమి లోటు
గుడి వచ్చి మీద పడ్డట్టు
గుడ్డి కన్నా మెల్ల మేలు
గుడ్డి కన్ను మూసినా ఒకటే తెరిచినా ఒకటే
గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నాడు
గుడ్డి నక్క వూరిన పడ్డట్టు
గుడ్డి మామగారా నమస్కారమయ్యా అంటే,రంధికి మూలమా రంకుల కోడలా అన్నాడట
గుణము యెద్దు జొన్న చేన పడ్డట్టు
గుడ్డివాడెరుగునా కుందనపు ఛాయ
గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించింది
గుణము మానవే గూటాల పోలే అంటే, నా మనువయినా మానుతాను గాని నా గుణము మానను అన్నాదట
గుమ్మడికాయ పోయే దారి యెరగడు, ఆవగింజ పొయ్యే దారి అట్టే పట్టి చూస్తాడు.
గుమ్మడి కాయల దొంగ అంటే, తన బుజాలు తానే పట్టి చూచుకున్నాడట.
గురువింద గింజ తన ఎరుపే గాని ముడ్డి కింద నలుపు ఎరగదు
గురువుకు పంగనామాలు
గురువుకు మించిన శిష్యుడు
గురువు తో గుద్దులాట
గురువు మాట మీర రాదు, గడ్డపార మింగ రాదు
గుర్రం గుడ్డిదైనా దానాలో తక్కువ ఉండదు
గుర్రము చచ్చినది గాక గుంట తవ్వ ఒక రూక
గుర్రాలు తిన్న కుక్క అదేమి బ్రతుకును
గుర్రం వలె కుక్కను పెంచి రెడ్డి తానే మొరిగినాడట
గుర్రానికి గుగ్గిల్లు తిన నేర్పవలెనా
గుర్రానికి తోక వుంటే తానే విసురుకొంటుందిగానీ, సావిట్లో వుండే గుర్రాలన్నిటికీ విసురుతుందా?
గుళ్ళో దేవునికి నైవేద్యం లేకుంటే, పూజారి పులిహోరకు ఏడ్చినాడట
గువ్వ గూడెక్కెను, అవ్వ మంచమెక్కెను
గూనికి తోడు గుర్రపు వాయువు
గృహప్రవేశంకు వెళుతూ గుడ్లగూబను తోడుతీసుకొని పోయినట్టు
గొంతు కోసేవాడు కట్టి ఏమరునా
గోదారివాని వద్ద తోలు కొన్నట్టు
గొడ్లు కాచేవాణ్ణి కొట్టనివాడు, గొర్రెలు కాచేవన్ని తిట్టనివాడు లేడు
గొడ్రాలికి యేమి తెలుసు బిడ్డ నొప్పులు
గొర్రె కొవ్వితే గొల్లవాడికే లాభం
గొర్రెను తినేవాడు పోతే, బర్రెను తినేవాడు వచ్చినట్టు
గొర్రెలలో తోడేలు జొరబడ్డట్టు.
గొల్లవాడి కొమ్మ హెచ్చనూ హెచ్చదూ తగ్గనూ తగ్గదు
గొల్లవారింటి పెండ్లి తెల్లవారింది
గోంగూరలో చింతకాయ వేసినట్టు
గోచీకి పెద్ద, అంగవస్త్రముకు చిన్న
గోట మీటితె పొయ్యే పనికి గొడ్డలి యెందుకు
గోడకు పెట్టిన సున్నమూ, లంజకు పెట్టిన సొమ్ము
గోడ మీద సున్నము విద్యాములోనికి పనికి వచ్చునా
గోడ వుంటే చిత్రం వ్రాయవచ్చును
గోనెల కన్నా కోతలు మెండు
గోరంత వుంటే, కొండంత చేస్తారు
గోరీ కాడి నక్క ఒట్టు
గోరుచుట్టు పైన రోకటి పోటు
గోవులను కోసి చెప్పులు దానం చేసినట్లు
గోవు లేని వూళ్లో గొడ్డుగోద శ్రీ మహాలక్ష్మి
గ్రామ శాంతికి బోడితల
గ్రాసము లేని కొలువు
ఘ
ఘంటాకర్ణునికి అష్టాక్షరీవుపదేశం చెయ్యబోయినట్టు