సంపాదకీయం  (Author: విజ్ఞానకుమార్)

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడూ కోలాహలంగానే జరుగుతాయి. ఇవి అమెరికకే కాదు, యావత్ప్రపంచానికేముఖ్యమైనవి.

కెన్నెడీ నిక్సన్ కాలంలో ఏ పార్టీ నెగ్గితే ఏమైంది, ‘దెందూ దెందే’ అనుకునే వారు కొంత మంది. ఎవరు గెలిచినా సామాన్య పౌరుడి జీవనంలో పెద్దగా తేడా ఏమీ రాదు అనుకునే వారు. కానీ ఈ మధ్య కాలంలో రెండు పార్టీల మధ్య వైవిధ్యం పెరిగిపోయి ఆ ప్రశ్నకి చాలా ప్రాముఖ్యత వచ్చేసింది. ఈ ఎన్నికలలో మరీనూ. గెలిచిన పార్టీ వల్ల ప్రపంచ రాజకీయాలలోనే కాదు, మనందఱి జీవితాల మీద కూడా ప్రభావం పడుతుంది, నీతీ జాతీ న్యాయం అన్యాయం అన్నింటికీ అర్ధాలు మార్చుకోవలసి రావచ్చు అనిపిస్తున్నది.

కాబట్టి ఈ ఎన్నికలలో ఓటు వేయడం చాలా ముఖ్యం. ఊళ్ళో ఉండేటట్లైతే ఓటు కేంద్రానికి వెళ్ళండి. ఉండమనుకుంటే పోస్ట్ లో వెయ్యండి. ఏదో విధంగా ఓటు తప్పకుండా వెయ్యండి.

***

ఇక ఈ సంచికలోః

‘మమతల ఒడి’ లో గొర్తి వాణీ శ్రీనివాస్ గారు, పిల్లల పెంపకంలో భార్యా భర్తల బాధ్యతల గుఱించి రాశారు.

‘అవ్వ పేరే ముసలమ్మ’ లో దత్త శర్మ గారు, ‘మనమూ మన మతమూ’ గుఱించి రాశారు

‘ఆకాశం వంగిన వేళ’ లో సత్యనారాయణ మూర్తి గారు తన దాకా వస్తేనే కానీ …. అన్న విషయం చర్చించారు

‘చెల్లీ...నన్ను క్షమించూ...!’ లో బొందల నాగేశ్వరరావు గారు అపార్ధాలు జీవితాలని ఎలా నాశనం చేస్తాయో చూపించారు.

‘గెలుపు’ లో సి. భవానీదేవి గారు, మామూలుగా చర్చించని విషయం, పిల్లాల మీద అత్యాచారాల గుఱించి రాశారు

తల్లి అన్న మాట కి ఒక వినూత్నమైన అర్ధం విశాలమైన అర్ధం చూపారు “కంటేనే అమ్మ! అంటే ఎలా?” లో ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు

‘కనువిప్పు’ లో ఆత్మ హత్య గుఱించి ఆలోచించే వాళ్ళ మనసులో దూరారు …. కాకు వెంకట శివ కుమార్ గారు.

‘గడప తల్లి’ అంటూ ఇంటి గడప మీద విచిత్రమైన కవిత రాశారు దొండపాటి. నాగజ్యోతిశేఖర్ గారు

విజ్ఞానంతో పాటు క్రౌర్యం కూడా పెరుగుతున్నాదా, అని అడిగారు ‘మానవత్వానికి రెక్కలు తొడగాలి’ లో శింగరాజు శ్రీనివాసరావు గారు

జడా సుబ్బారావు గారి ‘దేశమంటే యుద్ధం కాదోయ్!’  ఆలోచనలు రేకెత్తించే కవిత

ఆంధ్రులం భోజన ప్రియులం అని మఱో సారి గుర్తు చేశారు  ‘తెలుగు బువ్వంబంతి’ లో గడ్డం దేవీప్రసాద్ గారు

ప్రకృతి పట్ల మనం చేస్తున్న మారణహోమం ఏమిటని ప్రశ్నించారు ‘నువ్వో స్వయంకృతాపరాధివి..!!’ లో చింతలపట్ల కళా గోపాల్ గారు

దేశ భాషలందు తెలుగు Less ఐపోతోందా అని బాధపడ్డారు ‘తెలుగు వెలుగు!’ లో కోరుకొండ లక్ష్మణరావు గారు

నాన్న కి జోహార్లర్పించారు ‘అస్తిత్వ సంగీతం’ లో  రేపాక రఘునందన్ గారు

కాదేదీ కవితకనర్హం అన్నట్లు ‘వక్క రోలు’ నే ఒక ‘కళాఖండమ్’ గా రూపకల్పన చేశారు  యములపల్లి నరసి రెడ్డి గారు

View Attachment 1
Kommentera