సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం  (Author: తెలుగు కళా సమితి కార్యవర్గం)

న్యూజెర్సీలో అలరించిన త్రిమూర్తి సంగీత ఉత్సవం

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన త్రిమూర్తి సంగీత ఉత్సవం అందరినీ అలరించింది.

అమెరికా: తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన త్రిమూర్తి సంగీత ఉత్సవం అందరినీ అలరించింది. కర్ణాటక సంగీత మహావాగ్గేయకారులైన ముత్తు స్వామి దీక్షితులు, శ్యామా శాస్త్రి, త్యాగరాజులకు గాననీరాజనంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

శ్రీ ముత్తుస్వామి దీక్షితుల రచనలతో ప్రత్యేక సంగీత కచేరీని చేసి శ్రీమతి మంజుల రామచంద్రన్ గారి గానం చేసి తమ భక్తి శ్రద్ధలను చాటుకున్నరు. హారిస్ బర్గ్, పెన్సిల్వేనియా నుంచి వచ్చిన శ్రీమతి రాధిక గారు, తమ కుమారులు ఇద్దరితో వాగ్గేయకారుడు శ్యామశాస్త్రిగారి కీర్తనలతో అందర్నీ ఆనందపరిచారు. తెలుగు వారికి, ప్రతి సంగీత అభిమానికి పూజ్యుడు, ఆదర్శనీయుడు శ్రీ త్యాగరాజు గారి కృతులను టెక్సాస్ నుంచి వచ్చిన శ్రీమతి విశాల అవధానం గారు గానం చేయడం కార్యక్రమానికి ఒక శోభనిచ్చింది

    

సుమారు 20 సంగీత కళాశాలల గురువులు, తమ విద్యార్థులతో వాగ్గేయకారుల రచనలను శ్రుతి, లయలతో గానం చేశారు.

   

     

ఇంతటి మహోన్నతమైన కార్యక్రమానికి వచ్చేసి చేయూతనిచ్చిన న్యూజెర్సీ హెల్ప్ ఫౌండేషన్ వారికి TFAS కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలియ జేసి, వారిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన T P రావు గారెకి TFAS కార్యవర్గం ధన్యవాదాలు తెలియజేసింది.  పలు సంస్థల నుంచి వచ్చిన పెద్దలు సంగీత విదూషీమణులను సత్కరించారు.

ఈ సందర్భంగా తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్నా మాట్లాడుతూ.. శాస్త్రీయ సంగీత పోషణ, ప్రోత్సాహం ప్రతిబింబించేలా తెలుగు కళా సమితి నిర్వహించిన త్రిమూర్తి సంగీత ఉత్సవం అందరినీ ఆనంద డోలికలలో ముంచెత్తిందన్నారు. తెలుగు భాషకు ప్రాముఖ్యాన్ని ఇస్తూ, సంగీతానికి గౌరవాన్నిచ్చే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగం అని అన్నారు.

శ్రీ సత్య, శ్రీమతి వాణి, శ్రీమతి అరుంధతి, శ్రీమతి లత, శ్రీమతి వరలక్ష్మి, శ్రీ లోకేందర్, శ్రీ శేషగిరి గార్లు మరియూ TFAS volunteers అందరికీ ఆతిధ్యమిచ్చి, బాధ్యత గా కార్యక్రమాన్ని నిర్వహించి అందరి మన్నలనూ పొందారు.

 

 

Kommentera

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)