విశ్వరూపం  (Author: యలమర్తి అనూరాధ)

పుట్టగానే ఆయా అడిగే ఆమ్యా ఆమ్యాతో మొదలు 

అదేమి ప్రారబ్ధమో ఇది లేని చోటు లేదు భువిలో 

ఎక్కడికి వెళ్ళు నేనున్నానంటూ వెంటబడుతూనే 

నీడ మనిషిని వదలనట్లు అంటే ఇదేనేమో 

వీళ్ళంతా మరో బిచ్చగాళ్ళ అవతారాలు 

కాకపోతే చిరుగుల దుస్తులలో వాళ్ళు 

శుభ్రమైన బట్టలలో అశుభ్రంగా వీళ్లు 

మలినత అంటిన మనసులు అంటే ఇంతేగా 

ఆశ చేతులు మరే పెద్దవని అంటారందుకేనేమో 

అలా వచ్చినది అలాగే పోతుందని సూక్తి 

అదెక్కడో తప్ప కనిపించదు  

సంపాదించిన ఆ డబ్బే విదిల్చి బయటపడతారుగా 

ఇంతకంటే దారుణం మరొకటే ముంటుంది

న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టి మరీ గుంజుతారు 

అసలు జీతం వస్తున్నా ఈ కక్కూర్తి ఎందుకో 

అర్థం కాని వంద మిలియన్ల ప్రశ్న 

మీరయినా చెబుతారా సమాధానం 

రూపు మాపే ప్రయత్నంలో నాతో కలిసి నడుస్తారా?

చేయీ చేయీ పెనవేసి వ్యవస్థను పఠిష్ఠం చేద్దామా?

Kommentera