మనోనేత్రం  (Author: మూల వీరేశ్వర రావు)

జీవితం పరుగే కావచ్చు

వలసల్లో విలాసాలు కావచ్చు

ధనం మనషిని నడిపే ఇంధనం కావచ్చు

నాణ (ణె)మే ప్రేరణ కావచ్చు

కాని

మనో నేత్రాన్ని తెరిచి

సాంకేతిక సర్ప పరిష్వంగాన్ని 

వదిలించుకుని,  

అటు దృష్టి ని మరిలిస్తే,  

పుడమి పుత్రుడి పాద ముద్రలు,

మందాకినీ సలిలాలు,

మంజీర నాదాలు,

వెన్నెల జలపాతాలు

హరిత వనాల లో 

కోయిల కవనాలు  

పారిజాత పుప్పొడుల ఎత్తి పోతలు 

గాలుల గంధర్వ గానాలు,

సాగర తీరాలలో సైకత సౌధాలు,

నిశాంత నారి నృత్యాలు,

పురాతన ప్రేమ ప్రవచనాలు,

విశ్వంతరాళం లో 

నక్షత్రాల ముషాయిరా!

ప్రాచీన రాగాల జుగల్బందీ లో 

రహస్యాలు గా రాలి పోతున్న 

రాత్రి!  

స్వరం సవరించుకుంటున్న 

రహస్త్రంత్రి!

Kommentera