తస్మాత్ జాగ్రత్త!  (Author: నల్లబాటి రాఘవేంద్ర రావ్)

ఆడపిండం బరువా.. ఓ బండ మనిషీ..

దాన్ని హత్య చేసే హక్కు.. నీకున్నదా?

చట్టాలనుచుట్టాలుచేసుకొనితైతక్కలా   //ఆడపిండం//

ఇన్నాళ్లు ఆడప్రాణితో..కులుకులు..పలుకులు ములుకులు...గిలకలు... గొలకలు..రకరకాలు  

రాజ్యాలుమారాయి.... రోజులు మారాయి

మగతో సమంగా ఆడవారి చదువు, జీతo

మరి ఆడపిండమిపుడు బరువెట్లా అయ్యిందిరా

అబ్బో...అబ్బో...అబ్బబ్బో...ఓరబ్బో.....  // ఆడపిండం//

ఆడవారిలో సైతం... లాయర్ల... పోలీసులు..

ఎవరెస్ట్ అధిరోహణం, స్పేస్ ప్రయాణం...

ఇంజనీర్లు..డాక్టర్లు..ప్రిన్సిపాల్స్..శాస్త్రవేత్తలు కవులు..రచయిత్రులు.. నర్తకి.. గేయమణులు

మరి ఆడపిండమిపుడు బరువెట్లా అయ్యిందిరా

అబ్బో...అబ్బో... అబ్బబ్బో...ఓరబ్బో...... // ఆడపిండం//

 

ఆడపిల్లంటే ఇంట్లో పార్వతి లక్ష్మి సరస్వతి..

ఆడపిల్లoటే ఇంట్లో కళకళ..ఇంట్లో గలగల

' ఆడ '  మాతృదేవత పొట్టలో  కాకుండా 

నువ్వెక్కడ జీవం పోసుకున్నావు అసలు?

మరి ఆడపిండమిపుడు బరువెట్లా అయ్యిందిరా 

అబ్బో...అబ్బో... అబ్బబ్బో...ఓరబ్బో....... // ఆడపిండం//

ఆడదంటే  అమ్మ అక్క చెల్లి భార్య

నీ వంశం పెంచే...దేవుడిచ్చిన తోడు

ఆ ఆడదాని కడుపున మరో ఆడది  

పుడితే... నేరమా... ఘోరమా...!!

పాపమా..నీ బ్రతుకు సర్వనాశనమా!

''ఆడపిండం ''..జోలికి వస్తే.. ఇక.. నీ బ్రతుకు మురికికూపమే..నీపరిస్థితి దుర్గతే..అధోగతే..

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త     // ఆడపిండం// 

1 kommentar