ఆవె
ఆవె (Author: యలమర్తి చంద్రకళ)
మోసగాళ్ళ నడుమ మునిగెబడుగుజీవి
నమ్మకోయి నువ్వు నాయకులను
రక్తమంత త్రాగు రాబందులుకదర
దొంగజపము చేయు కొంగలేర!
---//---
ఆవె
వేలుపట్టి మనకు వెలుగునుజూపెడి
మిత్రుడొక్కడున్న మేలుకలుగు
రాళ్ళకేమి కొదవ రత్నమొక్కటిచాలు
ధరణియందు జన్మ ధన్యమౌను!
---//--
ఆవె
మనసుపొందు శాంతి మాధవు చెంతనే
రాధయేగ కృష్ణ రాగజలధి
బంధమిచ్చు మధుర భావన యోగమే
మంచుకొండవలెనె మత్తుగొల్పు!