తస్మాత్ జాగ్రత్త!
తస్మాత్ జాగ్రత్త! (Author: నల్లబాటి రాఘవేంద్ర రావ్)
ఆడపిండం బరువా.. ఓ బండ మనిషీ..
దాన్ని హత్య చేసే హక్కు.. నీకున్నదా?
చట్టాలనుచుట్టాలుచేసుకొనితైతక్కలా //ఆడపిండం//
ఇన్నాళ్లు ఆడప్రాణితో..కులుకులు..పలుకులు ములుకులు...గిలకలు... గొలకలు..రకరకాలు
రాజ్యాలుమారాయి.... రోజులు మారాయి
మగతో సమంగా ఆడవారి చదువు, జీతo
మరి ఆడపిండమిపుడు బరువెట్లా అయ్యిందిరా
అబ్బో...అబ్బో...అబ్బబ్బో...ఓరబ్బో..... // ఆడపిండం//
ఆడవారిలో సైతం... లాయర్ల... పోలీసులు..
ఎవరెస్ట్ అధిరోహణం, స్పేస్ ప్రయాణం...
ఇంజనీర్లు..డాక్టర్లు..ప్రిన్సిపాల్స్..శాస్త్రవేత్తలు కవులు..రచయిత్రులు.. నర్తకి.. గేయమణులు
మరి ఆడపిండమిపుడు బరువెట్లా అయ్యిందిరా
అబ్బో...అబ్బో... అబ్బబ్బో...ఓరబ్బో...... // ఆడపిండం//
ఆడపిల్లంటే ఇంట్లో పార్వతి లక్ష్మి సరస్వతి..
ఆడపిల్లoటే ఇంట్లో కళకళ..ఇంట్లో గలగల
' ఆడ ' మాతృదేవత పొట్టలో కాకుండా
నువ్వెక్కడ జీవం పోసుకున్నావు అసలు?
మరి ఆడపిండమిపుడు బరువెట్లా అయ్యిందిరా
అబ్బో...అబ్బో... అబ్బబ్బో...ఓరబ్బో....... // ఆడపిండం//
ఆడదంటే అమ్మ అక్క చెల్లి భార్య
నీ వంశం పెంచే...దేవుడిచ్చిన తోడు
ఆ ఆడదాని కడుపున మరో ఆడది
పుడితే... నేరమా... ఘోరమా...!!
పాపమా..నీ బ్రతుకు సర్వనాశనమా!
''ఆడపిండం ''..జోలికి వస్తే.. ఇక.. నీ బ్రతుకు మురికికూపమే..నీపరిస్థితి దుర్గతే..అధోగతే..
తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త // ఆడపిండం//