చీఛీ  (Author: దేశరాజు రవి కుమార్)

పాలిండ్లేమిటి ఇంత పెద్దగా వున్నాయి?

వేళ్లు వెడల్పు చేసి గట్టిగా పిసికాడు

బుళక్‌న నెత్తురొచ్చింది

చీఛీ..

కళ్లేమిటి ఇంత విశాలంగా వున్నాయి?

వేళ్లతో పొడిచి లోనికి తొంగిచూశాడు

బోరువెల్ పడినట్టే ఉబికాయ్

చీఛీ..

నడుమేమిటి నడివీధిలోకి వచ్చింది?

చేయి చాచి ఒక్క నొక్కునొక్కాడు

పంక్చరైన లారీ టైర్‌లా..

పుసుక్కున గాలొదిలేసింది

చీఛీ..

ఏమిటో దాచిపెట్టావ్?

బొందు పట్టుకుని బర్రున లాగేసాడు

మటన్ షాపులో తలకిందులుగా వేలాడగట్టిన

మేకలా మే..మే.. అంది

చీఛీ..

పైకొచ్చి చూశాడు, పెదవి మాటునేముందో?

సారముడిగి పెచ్చులు దేలిన పచ్చని భూమిలా

నాలిక గిడసబారిపోయింది

చీఛీ..

పొంగిన చెంపల్లోకి నాసిక పొడుచుకొచ్చిందేమి?

వంటింటి మసాలా వాసనలతో పొగచూరి

జిడ్డోడుతోంది.

చీఛీ..

చివరగా అటూఇటూ చూశాడు,

రెక్కలు విప్పినట్టు ఆ చెవి డొప్పలేమిటో?

తాకీతాకగానే ప్రపంచం చెవులు చిల్లులు పడేలా

ఓ స్వరం విరుచుకుపడింది

యత్ర నార్యస్తు పూజ్యంతే.

గుడ్.. వెరీ గుడ్,

ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్.

Comentar

2025 వేసవి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


కోతి చేసిన సాయం (బాలలు)


సాధిక! (కథలు)


TFAS ఉగాది సంబరాలు (TFAS కార్యక్రమాలు)


మనోనేత్రం (కవితలు)


అభీష్టం (కథలు)


వసంత శోభ - కవి సమ్మేళనం (TFAS కార్యక్రమాలు)


సైడు పక్క పదాలు (వ్యాసం)


'సామెతలు' - 2వ విడత (వ్యాసం)


సైతాన్ ఉరేసుకుంది (కవితలు)


వింత మాటలూ! వింత అర్ధాలూ! (వ్యాసం)


పాత్రోచితం (కథలు)


మా ఊరు మారింది (కవితలు)


మానస మధనం ! గహనం! (కథలు)


అన్నీ తెలిసినట్టే ఉంటాయి శోథిస్తే తప్ప (కవితలు)


అక్షర వ్యూహంలో అభిమన్యుడు (కథలు)


దత్తత (కథలు)


భాషాభిమానిని నేను...! (కవితలు)


రాగ బంధాలు (కథలు)


చికిత్స (కథలు)


లిటిల్ సోల్జర్ (కథలు)


ఆమె కథ (కథలు)


ఎరుక (కథలు)