గరళ కంఠి  (Author: పొత్తూరి ఉమాదేవి)

          నారివై యుద్దాన కదం తొక్కావు

          సేవా నిరతివై మదర్ తెరీసా వైనావు

          చరిత్ర పుటల్లో సుస్థిర స్థానానివి నీవు

           నిన్ను వేలు ఎత్తి చూపిన

           మృగజాతికి సృష్టే లేదు

           అపరకాళివై అన్ని రంగాలలో

           యుద్ధభేరి మోగించు

           శక్తి వై ఈ……

           భూమండలాన్ని వర్షపు చినుకువై చల్లగా కాపాడు

            నిన్ను కన్న తల్లులకు వేల వందనాలు

            చల్లని నీ కరుణకు

            ఇవే మా కరతాళ ధ్వనులు

            నిన్ను ఎండమావిని చేసి

            ఆడుకున్న బొమ్మలకు

            ఆయుధానివై విల్లు ఎక్కు పెట్టు.

Comentar