అంతర్జాలం నుంచి
అంతర్జాలం నుంచి (Author: అంతర్జాల అనామిక)
తల - తాకట్టు పెట్టుకోవడానికి
గడ్డం - పట్టుకుని బతిమాలడానికి
ముక్కు - పిండి వసూలు చేయడానికి
వీపు - విమానం మోత మోగించడానికి
కాలు - బలపం కట్టుకుని తిరగడానికి
కాళ్ళు - పట్టుకుని బతిమాలడానికి
అరికాలు - దాని మంట తలకెక్కించుకోడానికి
కళ్ళు - నిప్పులు పోసుకోడానికి
భుజాలు - గిమ్మడికాయల దొంగెవరంటే తడుముకోడానికి
చెంప - ఛెళ్ళుమనిపించడానికి
వేలు - ఎత్తి చూపించడానికి
అరచేయి - వైకుంఠం చూపించడానికి
పొట్ట - తిప్పలకోసం
నడుము - వంచి పని చేయడానికి
నొసలు - చిట్లించడానికి