మనం తెలుగువారమండీ  (Author: విశ్వనాథ రెడ్డి)

మనం తెలుగువారమండి..!

మనమే...తెలుగువారమండి..!!

అజంత భాషగ ప్రసిద్ధి కెక్కిన అనంత రీతుల కీర్తిని పొందిన

అమ్మ లాంటి ప్రేమ ఉన్న అందమైన భాష మనది..!

కపుల కలం గళం పలుకు కమ్మనైన భాష మనది..!!

కలకాలం మనమంతా కలిసి మెలిసి ఉండాలని.!

కలలుగన్న ఆ ఊహే ఒక కమ్మని తలంపు..!!

కుల మతాల కుత్సితాల కుడ్యాలను ఛేదించి

కూడినపుడు సమస్యలకు ఒక చక్కని ముగింపు..!!

అనురాగం, ఆప్యాయత హృదయంలో నిండాలి..!

ఉత్సాహం, ఉత్తేజం..ఊపిరి గా ఉండాలి..!!

సహకారం సమభావం సయోధ్యతో కలవాలి..!

అన్యోన్యత ఆప్యాయత అయోధ్యగా నిలవాలి..!!

అది మనసును కదిలించే దీవెన...!

అదే మనిషిని గెలిపించే భావన..!!

మనం..మనమందరం...

మన లోపలి దీపాలని వెలిగిద్దాం..!

అశేష వైషమ్యాలను అసూయా చీకట్లను..తొలగిద్దాం..!!

మనం..తెలుగువారమండి..!

మనమే తెలుగువారమండి..!!

Ajouter des commentaires