ప్రణయేంద్రజాలం  (Author: దాసరి దేవేంద్ర)

ఆ తూరుపు సిగలో విరబూసిన వెలుగు పువ్వు

నీ కనుపాపల పసి వేడిమికే వసివాడింది

ఆ పున్నమి ఉయ్యాలలో నిదురోయే జాబిలమ్మ

నీ అరచేతిన గోరింట కాలేదని అలిగింది.

 

ఈ ఊహల పొదరింటికి ఏమంతటి మధుమాసం

తలపు తేనెటీగలు ముసిరే మనసే మకరందం

మమతను స్పర్శించే నీ శ్వాస సిరి గంధం

పరువాల ప్రాసలతో అల్లినదీ ప్రేమ కందం.

 

ఓ ఆశల మణిదీపం కంటి ప్రమిదలో వెలుగుతుంటే,

నీ ధ్యాసలో ఊసులన్నీ కాగితాన ప్రణయ లేఖలౌతుంటే,

గుబులు ఎదన పలికిన ఆ సరిగమల సంగతేంటని

బిడియపు మడి కట్టిన నీ జవరాలిని అడగవోయి.

 

అల్లన మలిరాతిరి చలిగాలి వీస్తోంది

రెప్పలు కప్పుకొని కనుకు కునుకు జాడ వెతికాను

ఆ కలల యవనికపై నవసుందరి నీవే

ఆ మగత దేశాన నాకు పౌరత్వం కావాలి.

 

మునుపెరుగదు నా ఏకాంతం ఈ అందాల వాసంతం

ఆలోచన జలం తన తలపు శంఖాన ఓ వలపు తీర్థం

మునివేళ్ళతో లెక్కిస్తూ దాయలేను పరవశ ప్రాయపు వేగం

మృధు మానసవీణ పలుకుతున్నది ప్రణయరాగం.

 

నిన్నటి దాకా శిలనే నేను

నీ మాలిమి ఉలి తాకిన తరుణాన

అనురాగ నగిషీల ప్రేమ శిల్పమయ్యాను.

 

నా గుండె గుడిలో నిన్నే దేవిగా కొలుస్తాను

ప్రాణదీపం నీదేనంటూ కడశ్వాస దాకా ఆరాధిస్తాను...

 

*********

Ajouter des commentaires

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)