చిన్ననాటి ఙ్ఞాపకాలు  (Author: గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్)

నిన్నమావూరెళ్ళా
పాతరోజులు తలచుకున్నా

కొన్నిరహస్యాలను
పొట్లాంలో కట్టివేశా
కొన్నిఙ్ఞాపకాలను
మదిలోదాచిపెట్టా

రహస్యాలు వెంటబడుతున్నాయి
ఙ్ఞాపకాలు తరుముకొస్తున్నాయి

పొట్లాం విప్పాలని ఉంది
దాపరికాలు చెప్పాలని ఉంది

మారుమూల పల్లెలోపుట్టా
కడుపేద కుటుంబంలో పెరిగా
పూరింట్లో జనించా
పేదింట్లో వసించా

 

గుడ్డ ఉయ్యాలలో ఊగా
తల్లి ఉగ్గుపాలతో మాటలు నేర్చా

అక్కచెల్లెల్లతో అనురాగాలు పంచుకున్నా
అన్నదమ్ములు మిత్రులతో ఆట్లాడి ఆనందించా

బడికి నడిచివెళ్ళా
బాగా చదువుకున్నా

ఇంటిచుట్టూ మొక్కలు నాటా
పుష్పాలు పూయించా

చింతచెట్టు ఎక్కా
లేత చిగుర్లు కోశా
కందిచేలలోకి వెళ్ళా
కాయలనుతెచ్చి
వండుకొనితిన్నా

జొన్నచేలలోకి పోయా
పాలకంకులను తిన్నా

చెరువులో మునిగా

ఏటిలో ఈదా

పొలాల్లో తిరిగా
పశువులను కాచా

కావిడి మోసా
చెట్లను ఎక్కా

వరలక్ష్మిని వివాహమాడా
ఉన్నతోద్యోగాన్నిసంపాదించా
మేడలు కట్టా
మిద్దెల్లో నివసించా

సుసంతానాన్ని కన్నా
వృద్ధిలోనికి తెచ్చా

పేరుప్రఖ్యాతులు పొందా
సన్మానసత్కారాలు అందుకున్నా

పూరింటిని మరువలేకున్నా
ఙ్ఞాపకాలను వీడలేకున్నా

పూరిల్లే నాజన్మస్థానము
పేదవాళ్ళే నాబంధుజనము

పల్లెలను ప్రేమించుదాం
పేదలను ప్రగతిలోకి తెద్దాం

 

         *** *** *** ***

Ajouter des commentaires

2025 ఉగాది సంచిక

తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)


పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)


అమ్మ (కథలు)


చిన్ననాటి ఙ్ఞాపకాలు (కవితలు)


అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)


ధర్మో రక్షతి రక్షితః (కథలు)


దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)


ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)


శ్రమ జీవన పతాకం (కవితలు)


ఛిద్రమైన బతుకులు (కథలు)


నారీ భారతం (కవితలు)


అమ్మకు ప్రేమతో… (కథలు)


శుభ సంక్రాంతి (కవితలు)


జీవన నౌక (కథలు)


ఓ వనిత కథ (కవితలు)


కృష్ణార్పణం (కథలు)


సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)


మరుగుజ్జు (కథలు)


శ్వాస (కథలు)


తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)