ఆ నిశానీ వెనుక  (Author: కొంపెల్ల కామేశ్వరరావు)

ఆ నిశానీ వెనుక 
అతని గుండెల్లో కమ్ముకున్న 
నిరవధికమైన అంధకారం 

జ్ఞానచక్షువు చుట్టూ ఆకలి రాక్షసి పన్నిన 
పేదరికపు జ్వాలాజాలం

ఏ శుక్రకణం ఎవరి అండంతో 
సంగమించిందో తెలియక
ఎంగిలి ఆకులు వెతుక్కుంటున్న బాల్యం
అక్షర హృదయ సౌందర్యమెరుగదు

ఎంత ఎదిగినా ముందుకు నడుస్తున్నట్టే నడుస్తూ 
వెనక్కే సాగుతున్న పయనం
వెనక్కి వెళ్తున్నప్పటి ఆ పయనాన్నే అనుసరిస్తూ 
అక్షర దేహాన్ని చూడలేని
వేల వ్యక్తుల సామూహిక నడక
అక్షరం వెలిగించిన 
దీపం కింద చీకటినే చూసే నిరక్షరాస్యత 

ఆ నిశానీ వెనుక
అమ్మ స్తన్యం తాగి జీర్ణించుకున్నంత సులువైన
అమ్మభాషను పాదధూళి కన్నా 
హీనంగా చీదరించుకుంటూ
ఆంగ్లభాషతో అధికార గర్వం 
కలిసి నేసిన కుతంత్రం

ప్రపంచమెంతగా గ్రహాంతరాల్లోకి చూస్తున్నా
ఆకాశంలో పేరుకున్న చీకటే కనిపిస్తూ ఉంటే
ఎప్పటికీ ఆ నిశానీ రేఖల్లోంచే
బతుకును గడిపేస్తున్న
జనానికి చేవ్రాళ్ళ దగా తెలిసేదెప్పుడో
 

Ajouter des commentaires

సంక్రాంతి సంచిక

అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)


సంపాదకీయం (సంపాదకీయం)


గుంటూరు లో కనులవిందుగా TFAS ‘కృష్ణ లీలా తరంగిణి’ (TFAS కార్యక్రమాలు)


ఉఱ్రూతలూగించిన సంక్రాంతి వేడుకలు (TFAS కార్యక్రమాలు)


జయ వందేమాతరం (కవితలు)


సంక్రాంతి...... (బాలలు)


శిక్ష నాది కాదు (కథలు)


అచ్చతెలుగు మాటలాట (వ్యాసం)


యుద్ధం వద్దు శాంతే ముద్దు (బాలలు)


చిరస్మరణీయం (కవితలు)


లక్ష్యం చేరిన గమ్యం (కథలు)


మృత్యోర్మా అమృతంగ‌మ‌య (కథలు)


కళ్ళున్న మనసు (కథలు)


అక్షరాలని ప్రేమిస్తాను (కవితలు)


అక్షర కోవెల! అంతర్యామి (కవితలు)


నేను శాంతిని‌ కోరుకొంటాను (కవితలు)


ధాతువు (కవితలు)


ఊరవతలి మేఘం (కథలు)


అతనొక శాపగ్రస్తుడు (కవితలు)