Article
అధ్యక్షుని సందేశం (Author: అన్నా మధు)
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం
వసంతకాలం వచ్చి ముగుస్తున్నా శీతాకాలం మీద మోజు తగ్గని న్యూ జెర్సీ రాష్ట్రం, ప్రజలను వారి వారి ఇళ్లలోనే వెచ్చగా ఉండమని గంటకు 20 మైళ్ళ వేగంతో ప్రతిరోజు హెచ్చరించింది. ఇప్పుడిప్పుడే అనుకూల వాతావరణం ఏర్పడినందున మీకందరికీ మరొకసారి వివరాలను పంచడానికి సన్నద్ధమయ్యాను.
ఏప్రిల్ 12న బ్రిడ్జ్ వాటర్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఆడిటోరియం లో జరిగిన శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యద్భుతంగా జరిగి మా కార్యవర్గ సభ్యులకు అత్యంత ఆనందాన్నీ, ఉత్సాహాన్ని పెంపొందించాయి. సంగీత సాహిత్య విలువలతో ఏర్పరచిన ఈ కార్యక్రమాలు ఇతర తెలుగు సంస్థల గుర్తింపుని అభిమానాన్ని చూరగొన్నాయి. దీనికి ఉదాహరణ సౌత్ జెర్సీ తెలుగు అసోసియేషన్ వారి ఉగాది వేడుకల సభా వేదికపై మే 3 వ తారీఖున BCIT, Medford న్యూ జెర్సీ లో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పరిచి ఎంతో గౌరవించారు. ఆ కార్యక్రమం లో నేను, ఉపాధ్యక్షుడు శ్రీ ఊటుకూరి ప్రసాద్ గారు, కార్యదర్శి శ్రీ వెంకట సత్య గారు కలిసి తెలుగు మహాభారత కవులను పరిచయం చేసి నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన పద్యాలను గానం చేసాము. ఈ కార్యక్రమం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వారి హర్షధ్వనులు మాకు వీనుల విందు కలిగించాయి.
జూన్ నెలలో 14 వ తారీకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆధ్వర్యంలో, వారు రచించిన శివం పదం లోని కొన్ని గీతాలను నృత్య మాధవి డాన్స్ అకాడమీ, శ్రీ దివ్య ఏలూరు గారి శిష్య బృందం నృత్య రూపం లో ప్రదర్శించబోతున్నారు. ఈ కార్యక్రమం స్వామినారాయణ మందిర్ వర్ధల్ సోమర్సెట్లో ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ప్రతి ఒక్కరూ శివపాద నాట్యకుసుమాంజలి తిలకించి, ఆనందించవలసిందిగా నా మనవి.
మొట్టమొదటిసారిగా సభ్యుల ఉత్సాహాన్ని ఆహ్లాదాన్ని పెంచడానికి జూన్ 22న ఉదయం 9 గంటలకు Wyckoff, NJ లో బౌలింగ్ పోటీలు నిర్వహిస్తున్నాము. ఉత్సాహవంతంగా పాల్గొని బహుమతులు పొందవలసిందిగా నా మనవి.
సెప్టెంబర్ 29 2024 నాడు మన TFAS చేత సత్కరించబడిన గిన్నీస్ బుక్ అవార్డు గ్రహీత 72 మేళ కర్త రాగాలలో మధుర కామాక్షి గీత రచయిత శ్రీ వీణా పాణి గారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు కళా రత్న అవార్డుతో సత్కరించి సన్మానించడం ఎంతో సంతోషకరమైన విషయం. వారికి TFAS తరపునఅభినందనలు తెలియచేస్తున్నాను
పద్మ అవార్డులు పొందిన తెలుగు మహనీయులందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు
రాబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరి సహకారం కావాలి.
అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ...
మీ
మధు అన్న
2025 ఉగాది సంచిక
తెలుగు కళాసమితి అధ్యక్షుని సందేశం (TFAS అధ్యక్షుని సందేశం)
సంగీత త్రిమూర్తి ఆరాధనోత్సవం (మా సమాచారం)
పురుషులందు పుణ్యపురుషులు వేరయా (వ్యాసం)
అకారాది సామెతలు - మొదటి విడత (వ్యాసం)
దేశ భాష లందు తెలుగు లెస్స! (కవితలు)
ఇచ్చట నేరస్థులు తయారు చేయబడును (కథలు)
సెల్ ఫోన్ సిక్ లీవ్.... (కవితలు)
తెలుగు వెలుగుల మహోదయం (కవితలు)