నాటి భారతం
నాటి భారతం (Author: గోగినేని రత్నాకరరావు)
నందర నొకరీతి । నాదరించి
తే॥గీ॥ సకల సుగుణాభిరామవై । సన్నుతింప
భాష చాలని ఘనతను । బడసినావు
యోగ్యముగ నీకడ చరించు । భాగ్యమంది
పాలుగొంటి మాఘనతను । భరతమాత! (5)
సీ॥ పసిడి పంటలవెల్గు । బహుళంబు వరకును
ప్రసరింప గాజేయు । పంటచేలు
వేదసుగంధముల్ । విశ్వవీధులయందు
వ్యాపింపజేయు వి । ద్యాలయాలు
ఎట్టి రుగ్మతనైన । నెడలింపగా జాలు
దక్షతన్ కల్గు వై । ద్యాలయాలు
కార్యార్థులై వచ్చు । కడప్రాంత జనులకు
సకల సౌకర్య వ । సతిగృహాలు
తే॥గీ॥ నీతినియమాలు వీడని । నిమితగాళ్ళు
ధర్మమార్గంబు తప్పని । తక్కువారు.
ఎటను రఘురామ రాజ్యంబె । ఎంచిచూడ
ప్రకట గుణగణ భరిత! మా । భరతమాత (6)
---- జైహింద్ ----