ఆధునికాంధ్ర మహా భాగవతమిట్లుండునొకో  (Author: Anonymous)

నవజీవన భాష్యాలు!

కంప్యూటరు స్పృశించు కరములు కరములు

      సెల్ఫోనులో వాగు జిహ్వ జిహ్వ

వాట్సాపు చూచెడి వాల్గంటి వాల్గంటి

      వెంటనే లైక్ కొట్టు వేలు వేలు

ట్విట్టరులో పెట్టి తిట్టు తిట్టే తిట్టు

       ఫేసు బుక్కై పోవు ఫేసు ఫేసు

వీడియో చాటింగు విద్యార్థి విద్యార్థి

       స్మార్ట్ ఫోను చెప్పెడి చదువు  చదువు

ఆరు సిమ్ముల వాడె పో ఆధునికుడు

అప్పులెగ్గొట్టు వాడె పో గొప్పవాడు                                                                                     

ఇవి ఎరుంగని వాడె పో చవట యనగ

నాగరికమున సర్వము నాశమగుటె

                             ఆధునికాంధ్ర మహా భాగవతమిట్లుండునొకో?

0 Comments